నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. పడయంగ రాని కొడుకుల ఁ
గడుఁబలవువురఁ బడసి పుత్త్రఘాతినివై తీ
కొడుకు నుదయార్క తేజుని
విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్

భావం: పొందశక్యంగాని కొడుకులను అనేకమందిని పొంది కూడా పుత్రులను చంపేదానివి అయనావు.ఆనందం కలిగించేవాడు, బాలసూర్యుడి ప్రకాశం కలవానిని వదలాలంటే నాకు శక్యం కాదు.అని తన ప్రతిజ్ఞ గుర్తున్నప్పటికీ కొడుకులపై ప్రేమానురాగాన్ని వదులుకోలేక పుట్టిన ప్రతిపిల్లవాడ్ని చంపివేయడం చూడలేకున్నాను అన్నాడు. అష్టవసువుల్లో చివరి వాడు, పైగా వసువుల నాల్గవ అంశగా పుట్టినవాడు అయన శిశువును నదిలో విడిచివేస్తున్న గంగను చూచి శంతనుడు ఇలా పిల్లలను పడవేయద్దని కోరుకున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము