నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ఇప్పురంబున బ్రాహ్మణుండింధనార్థ
మేఁగి మున్నయావృక్షంబు నెక్కి దాని
ద్రోవ దగ్థుఁడై మఱి దానితోన లబ్ధ
జీవుఁడై వచ్చి జనులకు జెప్పె దీని
భావం: పరీక్షిత్తు చంపాలనుకొన్న తక్షకుడు, పరీక్షిత్తు మహారాజు కాపాడాలన్న కశ్యపుడను ముని ఇద్దరూ పందేలు వేసి పచ్చని చెట్టును కాస్తా తక్షకుడు తన విషంచేత కాల్చి బూడిద చేశాడు. అపుడు కశ్యపుడు కూడా ఏమాత్రం జాగుచేయక ఆ బూడిదనంతా ఒక దరిచేర్చి వెంటనే తన మంత్రాలను చదివి వాటి శక్తిచేత ఆ చెట్టునుతిరిగి బతికించాడు. దానికి ఆశ్చర్యపోయిన తక్షకుడు ఈ చెట్టును బతికించారుకాని శృంగి శాపం బలవత్తరమను విషయాన్ని చెప్పి, పరీక్షిత్తు ఇచ్చే ధనరాశికన్నా ఎక్కువ ధనాన్ని నేను ఇస్తాను దాన్ని తీసుకొని వెనక్కు వెళ్లుము అని తక్షకుడు చెప్పాడు. దానిలోని నిజానిజాలను ఎరిగి బలవత్తరమైన శృంగి శాపం వలన పరీక్షిత్తుకు మరణమే సంభవమన్న నిజాన్ని తెలుసుకొని అతడిచ్చే కానుకలను తీసుకొని కశ్యపుడు వెనుతిరిగాడు. ఈ సంగతిని హస్తినాపురంలోని విప్రుడొకడు కట్టెల నిమిత్తం అడవికి వెళ్లి, తక్షకుడు ఆ వృక్షాన్ని కాల్చటానికి ముందే దాన్ని ఎక్కి దానితోపాటు కాల్చబడి తర్వాత ఆ చెట్టుతోనే పొందబడిన ప్రాణం కలవాడై పట్టణానికి తిరిగి వచ్చి ఈ వృత్తాంతాన్నంతా జనులకు చెప్పాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము