నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను మైన వారి బు
గ్యజుష పదక్రమంబులుక్రియన్ గుణియించుచు వచ్చువారి న
గ్గజపుర వల్లభుండు గని, గ్రక్కున దాయఁగ బిల్చి మెచ్చి భా
వజనుభగుండు చేకొనియె వారలు దెచ్చిన వాని నన్నిటిన్
భావం: మన్మథుని వలె సుందరుడు హస్తినాపుర ప్రభువు అయినపరీక్షిత్తు మిక్కిలి ప్రియమైన రూపం కలవారిని, ఋగ్వేదం, యజుర్వేదం పదపాఠాన్ని, క్రమపాఠాన్ని అనుగుణ మైన క్రియతో లెక్కిస్తూ వచ్చేవాళ్లను బ్రాహ్మణయువకులను, (బ్రాహ్మణరూపంలో ఉన్న నాగకుమారులను) చూ వెంటనే దగ్గరకు రమ్మని పిలిచి వారు తెచ్చిన పూలను, పండ్లను అన్నింటినీ స్వీకరించాడు. తక్షకుడు కశ్యప ముని దారి మళ్లించి వెంటనే సర్పకుమారులను పిలిచి మీరు బ్రాహ్మణులై సువాసన పూవులను, వనంలోని రుచిగల పండ్లను మోదుగ ఆకులలోను, బుట్టలలోను పెట్టుకొని పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి ఇవ్వమని ప్రోత్సహించి పంపాడు. అలా వెళ్లిన వారిని పరీక్షిత్తు చూచి వారిని నిజమైన బ్రాహ్మణులుగా తలిచి వారిని దగ్గరకు రమ్మని పిలిచి వారు తెచ్చిన వాటిని స్వీకరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము