నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. కాదన కిట్టి పాటియపకారముఁ దక్షకుడుఁడేకవిప్ర సం
బోధనఁ జేసె చేసె నృపపుంగవ నీవు ననేక భఊసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్

భావం: ఓ రాజశ్రేష్ఠుడా! యుక్తం కాదనకుండా తక్షకుడు, శృంగి అనే ఒక బ్రాహ్మణుని ప్రేరణ చేత ఇంత అధికమైన కీడు చేశాడు. నీవు కూడా పలువురు బ్రాహ్మణులచేత నిర్వహించబడిన పాములను ఆహుతి చేసే యజ్ఞంలో తక్షకుడు మొదలైన పాముల సముహాన్ని భయంకరాలు, సంపూర్ణాలు అయిన అగ్ని జ్వాలలసముదాయాలలో బూడిద చేయుము. అని జనమేజయుని మంత్రులు రాజుకు హితబోధ చేశారు. వెంటనే ఆ మాటలన్నీ విన్న జనమేజయుడు కోపోద్రిక్తుడయినాడు. ఏమి చేయవలెనా అని ఆలోచనకు పూనుకొన్నాడు. అపుడు ఆలోచన చేసే జనమేజయుడు తన స్నేహితులను, బ్రాహ్మణ ప్రముఖులను, పురోహితాది కార్యాలు చేసేవారిని అందరినీ పిలిచి తన మదిలో చెలరేగే వ్యాకులతను అంతా వారికి చెప్పాడు. దాన్ని విన్న వారంతా వారికి తోచిన సమాధానాన్ని రాజుకు ఇవ్వసాగారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము