నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం ఎన్నాళ్ళు బ్రతుకబోదురు
కొన్నాళ్ళకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్ని హితము సతము మంచి కీర్తి కుమారీ!
భావము: ఓ కుమారీ! మానవులు ఎన్నాళ్ళు బ్రతికియుందురు? కొన్ని దినములకు మరణకాల.... కష్టముల చేత అణగిపోవుట ప్రపంచమందు ఉన్న జీవులందరికీ తప్పనిసరి. మంచి యశస్సు శాశ్వతమైనది. మానవులెవరూ శాశ్వతముగా వుండబోరు. జీవితము శాశ్వతము కాదు. కీర్తి శాశ్వతమైనది అనే విషయాన్ని ఈ పద్యం వివరిస్తున్నది.
బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ