మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్రీరమ్యుంజడుగాంగ, సువ్రతుని మాయింగా, శుచిందంభిగా
శూరున్ నిర్దయుగా, మునిన్ విమతిగా, శ్రోత్రప్రియాలాపు ని
స్వారుంగా బలవంతు గర్వితునిగా సద్వక్త వాచాలుగా
గ్రూరుండెన్ని సుధీగుణంబు దురితారూఢంబు జేయుంగదా!

భావము: మంచిని మంచిగా చూసే లక్షణం దుర్మార్గునికి వుండదు. ప్రతి మంచిలో దోషాన్ని చూడడమే అతని స్వభావం. లజ్జ కలవానిని మందునిగాను, తపోవంతుణ్ణి దంభము కలవానిగాను, శుచిగలవానిని వేషధారిగాను, శూరుణ్ణి దయాహీనునిగాను పేర్కొంటాడు. ఆత్మస్వరూపాన్ని మననం చేసే మునిని బుద్ధిహీనుడని దూషిస్తాడు. ప్రియాంగా మాట్లాడేవాణ్ణి దీనునిగా గణిస్తాడు. తేజోవంతుణ్ణి గర్విగా ప్రకటిస్తాడు. సభల్లో చక్కగా యుక్తియుక్తంగా మాట్లాడే వాణ్ణి వదరుబోతుగా భావిస్తాడు. ఇది దుర్మార్గుల లక్షణం.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ