నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానుగ భూతికిం దొడవు సజ్జనభావము, శౌర్యలక్ష్మికిన్
వౌనము, నీతి విద్యకు, శమంబు సుబుద్ధికి, విత్తవృద్ధికిన్
దానము, దాల్మి శక్తికిని ధర్మనిరూఢి కదంభవృత్తియుం
బూనికతోడ సర్వగుణ భూషణ మొన్నగ శీలమే సుమీ

భావము: సంపదలకు మంచితనం, శౌర్యానికి వౌనం, విద్యకు వినయం, జ్ఞానానికి విషయలోలుపత లేకపోవడం, ధనానికి సత్పాత్రదానం, శక్తికి ఓర్పు, ధర్మకార్యాలకు దంభం లేకపోవడం అలంకారాలు. ఈ విధంగా ఆయా గుణాలకు సౌజన్యాదులు అలంకారాలే అయినా వాటన్నింటికన్నా శీలమే- సత్స్వభావమే అన్నింటినీ మించిన అలంకారం. కనుక మానవుడు సచ్ఛీలాన్ని సంపాదించుకోవడానికి సర్వదా ప్రయత్నించాలి.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ