నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తక్షకుఁడతిభీతుండై
యా క్షణమున నరిగె ‘సురగణాధిప నన్నున్
రక్షింపుము రక్షింపుమ
రక్షింపుమ ’ యనుచు నప్పురందరు కడకున్
భావం: పరీక్షిత్తు మహారాజునకు శృంగి ఇచ్చిన శాపకారణంగా తక్షకుడు అతి బలవంతుడై పరీక్షిత్తును చంపాలన్న కోరికతో బయలుదేరి త్రోవ మధ్యలో ఉదంకుడను ముని కలిసి తాను తక్షకుని కాటు నుంచి పరిక్షిత్తును రక్షిస్తానని చెప్పినప్పటికీ వానికి పరీక్షిత్తు ఇచ్చే ధనరాశికన్నా ఎక్కువ ధనాన్ని నేను నీకు ఇస్తాను. నీవు తిరిగి వచ్చిన దారిన వెళ్లిపో అంటూచెప్పి పంపివేసి తాను మాత్రం నిర్భయుడు అత్యంత ఎత్తుగా కట్టిన సౌధంలో పరుపుపైన అతి జాగ్రత్తలు తీసుకొంటూ ఉన్న పరీక్షిత్తు మహారాజును కాటువేయాలన్న ఆత్రుతతో నాగకుమారులనే బ్రాహ్మణులుగా వేషంకట్టి వారి చేత రాజునకు పండ్లుపూలు పంపించి అట్లా పంపిన వాటిల్లో తాను అంటే తక్షకుడు క్రిమివలె దాగుండి పరీక్షిత్తు తీసుకొన్న పండునుంచి ఎర్రటి రంగుకలిగిన విషపుపాము గా మారి పరీక్షిత్తు మహారాజును కాటువేసి చంపిన తక్షకుడు నేడు జనమేజయుడు చేసే సర్పయాగానికి భయపడినవాడై పరుగు పరుగున ఇంద్రుని దగ్గరకు వెళ్లి ‘‘ఓ దేవతల అధిపతివైన ఇంద్రా నన్ను కాపాడుము, కాపాడుము,కాపాడుము ’’అని వేడుకున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము