నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలువకులాలు భంగి నలిన ప్రభవాండమునందు దేనిచే
నిలిచె, దశావతార వన నిష్ఠితుడయ్యె మురురి దేనిచే
బెలుచ కపాల హస్తుడయి భిక్షకుడయ్యె బురాశి దేనిచే
నల రవి దేనిచే తిరుగు, నా ఘనకర్మము వంద్యమే కదా!

భావము: ఏ కర్మవశముచే సృష్టికర్తయగు బ్రహ్మదేవుడంతటివాడే కుండలను తయారుచేసే కుమ్మరివాని మాదిరిగా వివిధ ప్రాణులను సృష్టించడానికి నియమింపబడ్డాడో, ఏ కర్మ ఫలితంగా విష్ణుమూర్తి దశావతారాలనే అడవిలో త్రోయబడ్డాడో, ఏ కర్మ కారణం చేత శివుడు చేతిలో భిక్షాపాత్రను ధరించి బిచ్చగాడిగా తిరిగాడో, ఏ కర్మ ఫలితంగా సూర్యుడు ఆకాశమార్గాన సర్వదా తిరుగుతూ వుంటాడో అట్టి సర్వనియమన శక్తి కలిన కర్మకు నా నమస్కారము.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ