నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లలితనికేతన ప్రియ విలాసవతీ ధవళాత పత్రస
ద్ద్విలసిత వైభవంబనుభవింపబడున్ సుకృతాను వృత్తిచే
జెలువగు పుణ్యకర్మము నశించిన నంగజ సంగరత్రుట
త్కలిత గుణోరు వౌక్తిక నికాయములట్లు దొలంగు సంపదల్

భావము: పూర్వజన్మంలో సత్కర్మలను ఆచరిస్తే వాటి ఫలితంగా మానవుడు ఈ జన్మలో మంచి మంచి మేడలు, విలాసవతులైన యువతులు, ఏకచ్ఛత్రాధిపత్యం కలిగిన రాజ్యం మొదలైన ఎన్నో వైభవాలు అనుభవించవచ్చు. సత్కర్మల ఫలం నశిస్తే ఆ మేడలు మొదలైన సకల సంపదలూ తెగిపోయిన ముత్యాల పేరులోని ముత్యాలు చెల్లాచెదరైపడిపోయినట్లుగా చెదరిపోతాయి.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ