నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదరమింత లేక నరుడాత్మ బలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదు పేర్మికి గీడగు మూలమెట్ల మ
ర్యాద హిరణ్య పూర్వ కశిపున్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదునకెగ్గు చసి ప్రళయంబును బొందడె మున్నుభాస్కరా!

భావము:్భస్కరా! మానవుడు తన బలాధిక్యంతో కొంచెం కూడా గౌరవము, మన్నన లేకుండా సజ్జనులకు అపకారం చేయడంవల్ల అతని పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుడు సద్గుణ సంపన్నుడైన తన కుమారుండు ప్రహ్లాదుణ్ణి కష్టాలకు గురిచేసి చివరికి తానే నశించిపోలేదా?

భాస్కర శతకములోని పద్యము - కె. లక్ష్మీఅన్నపూర్ణ