నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈక్షితి నర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుడైన సత్ప్రభుని రాకల గోరుదురెందు చంద్రికా
పేక్ష జెలంగి చంద్రుడుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదుర సారముదంబును బూని భాస్కరా!

భావము: భాస్కరా! ఈ లోకంలో ప్రజలందరు ద్రవ్యంపై ఆశ చేతనో లేదా ఏదైనా ప్రయోజనాన్ని అపేక్షించో తమ్ము సంరక్షించే మంచి రాజు రాకను కోరుకుంటారు. చకోర పక్షులు వెనె్నలయందలి కోరిక చేత ఎంతో ఉత్సాహంతో ఆనందంతో చంద్రోదయం కోసం ఎదురుచూస్తాయి కదా!

భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ