నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. రజనీనాథకు లైక భూషణుఁడ వై, రాజర్షి వై, ధారుణి
ప్రజనెల్లన్ దయతోడ ధర్మచరితం బాలించుచుం, దొంటి ధ
ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్
విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షితా!

భావం: ఓ జనమేజయమహారాజా! చంద్ర వంశ ప్రధానాలంకారాని వై ఋషివంటి రాజు వై దయతోను ధర్మంతోను కూడిన ప్రవర్తనతో భూమిలోని ప్రజలనందరిని పరిపాలిస్తూ మున్ను ప్రసిద్ధులైన ధర్మరాజును నాభాగుడిని , భగీరథుడిని , దశరథుడిని, మాంధాతను , రాముడిని , రఘుమహారాజు అర్జునుడిని ఉత్తమగు ణాలతో సరిపోలినావు. అంటూ సర్పయాగానికి ఆపమని ప్రాథేయపడుతూ వచ్చిన వాసుకి వంటి గొప్పనైన సర్ప శ్రేష్ఠులతో ఆస్తీక మహాముని మీకు ఏభయం లేదు నేను మహారాజుగారితో మాట్లాడుతాను అని చెప్పి వచ్చిన ఆ మహాముని జనమేజయమహారాజు రఘువంశంలోని కీర్తనీయుల వలె నీవు కూడా నీ పూర్వీకుల వంశ చరిత్రను మరింత రాణించేలా చేస్తున్నావు. నీవు గొప్ప ధర్మమూర్తివి అంటూ మహారాజును పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము