నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. అమ్మనుజేంద్రుఁడైన నలుయజ్ఞము, ధర్మజరాజనూయయ
జ్ఞమ్ముఁ బ్రయాగఁ జేసిన ప్రజాపతియజ్ఞముఁ బాశపాణియ
జ్ఞమ్మును గృష్ణుయజ్ఞము నిశాకరుయజ్ఞము నీమనోజ్ఞ య
జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్థనా

భావం: కౌరవ వంశాన్ని వృద్ధి పొందించేవాడా! జనమేజయా! ప్రసిద్ధుడైన నలమహారాజు యాగం ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞం బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రంలో చేసిన యజ్ఞం వరుణదేవుడి యజ్ఞం కృష్ణుడియజ్ఞం, చంద్రుడి యజ్ఞం, మనోహరమైన నీ యజ్ఞం ప్రకాశించే మహత్త్వంలో ఒక్క విధమే. అనగా ఇవన్నీ కూడా సమానాలే. జనమేజయుని చేత సర్పయాగాన్ని ఆపు చేయంచడానికి వచ్చిన ఆస్తీకమహాముని కౌరవ వంశానికి చెందిన జనమేజయుని పొగుడుతూ వారి పూర్వుల చరిత్రనంతా చెబుతున్నాడు. అంతేకాక చంద్రుడు, నలమహారాజు, కృష్ణుడు లాంటి వాళ్లు ఇంతకు పూర్వం చేసిన యజ్ఞాలన్నింటికన్నా కూడా ఈ జనమేజయుడు చేస్తున్న యజ్ఞమే గొప్పదని చెబుతున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము