నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ మహనీయతత్త్వ రస నిర్ణయ బోధ కధామృతాబ్ధిలో
దానును గ్రుంకులాడక వృథా తను కష్టము జెంది మానవుం
డీ మహిలోక తీర్థములనెల్ల మునిగిన దుర్వికార హృ
త్తామస పంకముల్ విడునె దాశరధీ కరుణాపయోనిధీ

భావము: దశరథరామా! నీ గొప్పదనము యొక్క సారస్వమిట్టిదని నిర్ణయించి తెలిపే నీ దివ్య చరిత్రమనే అమృత సముద్రంలో గ్రుంకులిడినపుడు దుర్వికారయైన హృదయమునందలి తామసమనెడి మాలిన్యములు తొలగిపోవును. కాని కేవలము ఈ లోకంలోని నదీ నదములవంటి తీర్థములలో శరీరాన్ని కష్టపెట్టుకొని మునిగినపుడు మనస్సులోని తామస భావాలు తొలగిపోవునా? తొలగిపోవని భావము.

దాశరథీ శతకములోని పద్యము