నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వగవక సంజీవని పెం
పగథిలో గర్వమున నసురు లా కచుతోడం
బగఁగాని చంపెద రాతఁడు
సుగతికిఁ జనుఁగాక యేల శోకింపంగన్
భావం: సంజీవని విద్య గొప్పతనాన్ని ఆలోచించక రాక్షసులు అధికగర్వంతో ఆ కచుడితో వైరం పూని అతడిని చంపుతారు. అతడు ఉత్తమ గతికి వెళ్లుగాక. దీనికి దుఃఖించట మెందుకు?

మ. మతిలోకోత్తరుఁడైన యంగిరమన్మం దాత్రసం డాబృహ
స్పతికింబుత్రుఁడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమ
వ్రత సంపన్నుఁ డకారణంబ దనుజ బ్యాపాదితుండైన న
చ్యుత ధర్మజ్ఞ మహాత్మ! యక్కచున కేశోకింప కెట్లుండుడున్
భావం: చ్యుతి లేని ధర్మాన్ని ఎరిగిన వాడా! పరమ ధర్మజ్ఞుడా! మహానుభావా! బుద్ధియందు లోకాతీతుడైన అంగిరసుడనే మునికి మనుమడున్నూ, నీ న్నాశ్రయించిన వాడున్నూ ప్రసిద్ధుడైన బృహస్పతికి కుమారుడన్నూ మీకు శిష్యుడున్నూ మంచి రూపం కలవాడున్నూ బ్రహ్మ చర్యాశ్రమమనే వ్రతంతో కూడిన వాడున్నూ అయినటువంటి కచుడు కారణం లేకుండానే రాక్షసుల చేత చంపబడిన వాడు కాగా అతడి కొరకు నేనట్లా దుఃఖించ కుండా ఉంటాను..

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము