నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తనువును జీనవము సత్త్వం
బును బడిసితి నీ ప్రసాదమున నీ యుదరం
బనఘా; వెలువడు మార్గం
బొనరింపుము నాకు భూసురోత్తమ దయతోన్
భావం: కచుడు సురాపానం వలన కలిగిన అరిష్టాన్ని తెలుసుకొన్నాడు. సురాపాన మత్తు వలన జరిగిన నష్టాన్ని అనుభవిస్తూ తిరిగి మరలా ఎవరూ ఇలాంటి మత్తుకు బానిసలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మద్యపానం చేసిన వారికి పాపం చుట్టుకుంటుందని శాపమిచ్చాడు. ఇక అపుడు తన కడుపులో ఉన్న బూడిద రూపంలో వున్న వానికి జవసత్వాలు, శరీరం కలిగేట్లుగా అంటే బతికున్నవానిగా చేశాడు. కచుడు తానెక్కడున్నాడో తెలుసుకొని తన గురువు, బ్రాహ్మణ శ్రేష్ఠుడైన శుక్రునితో మాట్లాడాలని అనుకొని - పాపరహితుడవు. బ్రాహ్మణ శ్రేష్ఠుడవు, అయిన ఓ శుక్రుడా నీ అనుగ్రహం వలన దేహాన్ని, ప్రాణాన్ని బలాన్ని పొందాను నాకు దయతో నీ కడుపు నుండి బయటకు వచ్చే విధం తెలియజేయవలసింది అని ప్రార్థించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము