నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటువలె కరిమొఱ వింటివి
ఎటు వలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాడఁగావుము కృష్ణా!

భావం: శరణాగతుడైన గజేంద్రుని ఆర్దాలాపాలను విని, పరుగు పరుగున వచ్చి సుదర్శన చక్రముచే మొసలిని ఖండించి అతనిని ఎట్లా రక్షించినావో ఈ స్తంభంలో నీ దేవుడున్నాడా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గద్దించినపుడు నీవు సర్వాంతర్యామివై ఆ స్తంభంనుండి ఎట్లు ఆవిర్భవించి రక్షించితివో, ఆవిధంగానే నన్ను రక్షించుము. కష్టాలకొలిమినుండి నన్ను రక్షించి కాపాడుదేవా.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము