నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రార్చిత శుభచరణ సు
భద్రాగ్రజ! సర్వలోక పాలన!హరి! శ్రీ
భద్రాధిప ! కేశవ! బల
భద్రానుజ!నన్ను బ్రోవు భవహర ! కృష్ణా!

భావం: కృష్ణా నీ పాదములు శుభప్రదములు. నీవు సమస్త లోకపాలకుడవు. బలరామునకు సుభద్రాదేవికి నీవు తోబుట్టువు. భద్రావతికి భర్తవు. భవబంధ విమోచనుడవు. నన్ను సంరక్షింపుము.
భద్రమవ్వాలని జీవితంలో శ్రీకృష్ణ చరణావిందములను పట్టుకొంటే భద్రా గ్రజుడైన హరి ఇహలోకంలో సుఖాలను ఇచ్చి పరలోకంలో తన సాయుజ్యం లో స్థానమిస్తాడని ఎందరో భక్తుల జీవితాలు మనకు ఆదర్శంగా కనిపిస్తాయ. అస్తవ్యస్తమైన జీవితాన్ని కూడా సరిదిద్దేవాడే భద్రుడైన కృష్ణుడు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము