నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ విభుడు ఘోర రణమున
రావణ వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యూ విభీషణు
నా విభు నే దలఁతు మదిని నచ్యుత కృష్ణా!

భావం! ఓ అచ్యుతా కృష్ణా ! పరమేశ్వరా! నీవు రామావతారంలో భయంకర యుద్ధము చేసావు. అధర్మమార్గుడైన రావణుని సంహరించావు. ధర్మమార్గంలో చరిస్తూ నిన్ను శరణు వేడిన ఆ రావణుని తమ్మునికే నీవు గెలిచిన లంకారాజ్యాన్నిచ్చి రాజును చేశావు. అట్టి ఓ దయామయా కృష్ణా! నిన్ను నేను నామనస్సు నందే నిల్పి కొలుతును. ఏ అవతారం దాల్చినా ధర్మమార్గులుగా ఉండమని మానవులకు నీవు చేసే బోధ నాకు నీ అనుగ్రహం వల్ల తెలుస్తోంది.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము