నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*
సీ. పద్మలోచన సీసపద్యముల్ నీమీదఁ
జెప్పఁబూని తివయ్య చిత్తగింపు
గణయతి ప్రాసలక్షణముఁ జూడను లేదు
పంచకావ్యశ్లోక పఠనలేదు
అమరకాండ త్రయం బరసి చూడగలేదు
శాస్ర్తియ గ్రంథముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించితిఁగాని
ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప
*
తే. తప్పుపడనేమి సద్భక్తి తక్కువౌనె
చెఱకునకు వంక పోనమి చెడునె తీపి?
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! కమలనేత్రా! నేను నీమీద సీసపద్యాలను చెప్పాలనుకున్నాను.దయతో స్వీకరించు. చంధోనియమాలైన గణయతి ప్రాసల్ని పాటించలేదు. పంచకావ్యాలు, అమరం, శాస్త్రాలు చదువలేదు. నీ దయని ఆసరగా గ్రహించి ఈ కృతి వ్రాసినాను. అంతేకాని నా తెలివితేటలేవీ లేవు. చెరకుగడ వంకరగా పెరిగినా దాని తీపికి లోటేమీ కల్గనట్లే, ఈ కృతిలో ఏవైనా తప్పులు దొర్లినా నా భక్తికి లోపమేమీ లేదుసుమా. అని శతకకారుడు కోరుకుంటున్నాడు. వ్రతం చెడినా ఫలం దక్కాలి అంటే భక్తి మెండుగా ఉండాలి. అందుకే సీసపద్యాలనే పుష్పాలను సమర్పిస్తాను. కాని అందులో ఏదైనా లోపం ఉంటే దాన్ని మన్నించి తన్ను అనుగ్రహించమని నారసింహస్వామిని కవి కోరుకుంటున్నాడు.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003