నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దురిత జాలము లెల్లఁ ద్రోలవచ్చు
నరసింహ! నీ దివ్యమంత్రము చేత
బలుపైన రోగముల్ పాపవచ్చు
నరసింహ! నీ దివ్య నామ మంత్రముచేత
రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత
దండహస్తుని బంట్ల -దఱుమవచ్చు

తే. భళిర! నేనీ మహామంత్ర బలము చేత
దివ్యవైకుంఠపదవి సాధించవచ్చు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ ! దురిత దూర!
భావం: ఓ నరసింహాస్వామీ! నీ పవిత్ర నామ మంత్రాన్ని జపించడం వల్ల పాపాలన్నింటిని పారద్రోలవచ్చు. కఠినమైన రోగాల్ని తొలిగించవచ్చు. శత్రువుల్ని తుదముట్టింపవచ్చు. ప్రాణాల్ని కొని పోవ వచ్చిన యమదూతల్ని తరుమవచ్చు. నీ నామ మంత్రాన్ని జపించి వైకుంఠథామాన్ని చేరవచ్చు. ఒక్క నారసింహుని మంత్రాన్ని అనుష్ఠించినట్లయతే ఆర్తిగా ఒక్కసారి పిలిచినట్లు అయతే పరమాత్మను కరుణించని ఘట్టం ఏదీ ఉండదు. ఆర్తిలేకుండాకేవలం డంబాచారాలను ప్రదర్శిస్తే భగవంతుడు కూడా అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటాడు. అట్లాకాక నిజమైన ఆర్తితో భగవంతునిపై అచంచలమైన నమ్మకంతో నామస్మరణచేసినవారికి భగవంతుడు తోడునీడై ఉంటాడు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము