నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఆది నారాయణా! యనుచు నాలుక తోడ
పలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కారమర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండి వారైనను
నిన్నుఁ గానని వారినే స్మరింప
మేము శ్రేషుటలమంచు మిడుకు చుండెడివారి
చెంతఁజేరగఁ బోను శేషశయన

తే. పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుడను సుమీ! ధరణిలోన
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: స్వామీ! నరసింహా! నీవే ఈ విశ్వసృష్టికి మూల పురుడవని స్తుతించే వారి పాదపద్మాలకు నేను సాగిలపడి మొక్కుతున్నాను. కాని, భూప్రపంచంలో మానవులెంత దొడ్డవారైనా, నిన్ను కనలేని వారైతే వారిని నేను పల్కరించను. అంతేకాదు ‘నీకంటే మేమే శ్రేష్టుల’మని విఱ్ఱవీగే వారి చెంత చేరను. ఓశేషశారుూ ప్రపంచంలో సత్త్వగుణం గల్గిన నీభక్తులెల్లరికి దాసానుదాసుడనుగా ఉంటాను. భగవంతుని పూజించడం కన్నా భాగవతులను సేవించడం అంటే పరమాత్మకు పరమ ప్రీతి. తన భక్తుని ఎవరైనా నిందిస్తున్నారంటే ఆయన తట్టుకోలేడు. కనుక అటువంటి భక్తవాత్సల్యం గల భగవంతుని కరుణనుపొందిన భాగవతులను సేవిస్తాను అని కవి అంటున్నారు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము