నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. మాన్యంబు లీయ సమర్థుఁడొక్కడు లేఁడు
మాన్యముల్ చెఱుప సమర్థులంత
యెండిన ఊళ్లగోఁ డెరిగింపఁ డెవ్వఁడు
పండిన యూళ్లకుఁబ్రభువులంత
ఇతఁడు పేదయటంచు నెఱిగింప డెవ్వఁడు
కలవారి సిరులెన్నఁ గలరు చాలఁ
దనయాలి చేష్టలఁ దప్పెన్నఁడెవ్వఁడు
పెఱకాంతి ఱంకెన్న పెద్దలంత
తే. యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి
ప్రభువు తప్పులంచును మరి పలుక వలెను
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: భూములు పేదలకు పంచి పెట్టగల వాడు లేడు. కాని వాటిని ఇవ్వకుండ చెడగొట్టగల దిట్టలున్నారు. కరువుతో నీరు లేక ఎండిన గ్రామాల కడగండ్లు తుడిచే వాడు లేడు గాని బాగా పంటలు పండిన గ్రామాల కందరూ నాయకులే. పేదల్ని పట్టించుకోరు గాని గొప్పవారి సిరిసంపదల్ని అందరూ పొగిడేవారే. తన భార్య అడ్డ తిరుగుళ్లని గూర్చి పట్టించుకోడు గాని పరస్ర్తిల వ్యభిచారాన్ని గోరంతలు కొండతలు చేసి చెబుతాడు. అసలు ఇలాంటి వారికి పెత్తనమిచ్చిన ప్రభువులది తప్పు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము