నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
సీ. తనువు ప్రాణముల్ తరలిపోయెడి వేళ
నీ స్వరూపమును ధ్యానింపవచ్చు
నిమిష మాత్రము లోన నిన్నుఁ జేరును గాని
యముని చేతికిఁజిక్కి -శ్రమలఁబడుడు
పరమసంతోషాన భజన చేసెడివారి
పుణ్యమేమనవచ్చు భోగిశయన
మోక్షము నీదాస ముఖ్యుల కగుఁగాని
నరకమెక్కడిదయ్య నళిననేత్ర!

తే. కమలనాభ నీ మహిమను గానలేని
తుచ్ఛులకు ముక్తిదొరుకుట దుర్లభంబు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం; ఓ నరసింహస్వామీ ప్రాణం విడిచి వెళ్లేవాడు చిట్ట చివర నిన్ను ధ్యానిస్తే వెంటనే మోక్షాన్ని అందుకుంటాడు. అతనికి నరకబాధ తప్పుతుంది. మహానందంతో నీ భజన చేసేవారు పుణ్యాత్ములు. నీ భక్తులకే మోక్షమబ్బుతుంది. నరక బాధలు వారినంటవు. నీ గొప్పదనం తెలీని అజ్ఞానులకు సంసారబంధ విముక్తి అబ్బదు.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003