నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*

సీ. బ్రతికి నన్నాళ్లు నీ భజన తప్పను గాని
మరణకాలము నందు మఱతునేమొ
ఆ వేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ గప్పఁగా భ్రమచేతఁ
గంపముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను ‘నారాయణా’ యంచుఁ
బిలుతునో శ్రమచేతఁ బిలువలేనొ
తే. నాటికిప్పుడె భక్తి నీ నామ భజన
తలచెదను జెవి వినవయ్య ధైర్యముగను
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
భావం:ఓ నరసింహప్రభూ నేను బ్రతికినంత కాలం నీ నామస్మరణ మానుకోను. కాని అవసాన కాలంలో యమభటులు వచ్చి నా ప్రాణాల్ని తోడేటప్పుడు కఫవాత పైత్యాల వల్ల బాధపడుతూ నోరార నిన్ను స్మరిస్తానో లేదో బోధపడటం లేదు. అందువల్ల నేడే భక్తితో నిన్ను భజిస్తాను. విని గుర్తుంచుకొమ్ము. అంత్యకాలంలో ఒక్కసారి భగవంతుని నామాన్ని ఆర్తితో పిలిస్తే చాలు భగవంతుని సాయుజ్యం లభ్యవౌతుందని చెప్పినా కూడా ఆఒక్కసారైనా పలుకడానికి కూడా పరిస్థితులు అనుకూలిస్తాయో లేదోనని సదా నీ నామానే్న పలుకుతుంటాను అనిశతకకారుడు చెబతున్నాడు.