నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పాంచభౌతికము దుర్బరమైన కాయం బి
దెమ్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షముల దాక మితముఁ జెప్పిరి గాని
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలి యందొ
యూరనో, యడవినో యుదక మధ్యముననో
యెప్పుడో విడుచట యే క్షణంబో

తే. మరణమే నిశ్చయము బుద్ధి మంతుఁడైన
దేహమున్నంతలో మిమ్ముఁ దెలియ వలయు
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ తండ్రీ పంచభూతాలతో నేర్పడ్డ ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. బ్రతుకుదెరువు నూరేండ్లు అంటారు కాని ఆ మాట నమ్మదగ్గది కాదు. బాల్యంలోనో, వనంలోనో, మసలితనంలోనో, ఊరిలోనో, అడవిలోనో, నీటిలోనో ఎప్పుడో ఎక్కడ ఒక చోట ఈ శరీరాన్ని వదలటం ఖాయం. చావు తప్పనిసరి. బుద్ధి మంతుడు శరీరాన్ని పరిత్యజించక ముందే మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి.

శ్రీ నరసింహ శతకములోని పద్యము