నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు
మాయ సంసారంబు మఱఁగి వరుఁడు
సకల పాపములైతె సంగ్రహించును గాని
నిన్నుఁ జేరెడి యుక్తి నేర్వలేఁడు
తుదకుఁ గాలుని యొద్ద దూత లిద్ధఱు వచ్చి
గుంజుక చనివారు కొట్టుచుండ
హింస కోర్వఁగ లేక యేడ్చి గంతులు వైచి
దిక్కు లేదని నాల్గు దిశలు చూడ
తే. తన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడేడి
ముందె నీ దాసుఁడై యున్న ముక్తి గలుగు
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం : ఓ స్వామీ! మానవుడు ఈ ప్రపంచంలో బ్రతికినంతకాలం సంసార మాయకి లోబడి సమస్తపాపాల్ని ప్రోగు చేసుకుంటాడే కాని నిన్ను పొందే ఉపాయాన్ని కనుగొనలేడు. చిట్ట చివర యమభటులిర్వురు వచ్చి ప్రాణాల్ని గుంజుతూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక కాపాడమని నల్దిక్కులు చూస్తారు. విడిపించే పుణ్యాత్ముడెవడూ కన్పించడు. అందువల్ల ముందే నీ భక్తుడై ఉంటే మేలు కదా. మోక్షం సిద్ధిస్తుంది.

శ్రీ నరసింహ శతకములోని పద్యము