నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాదన పరుల్ దారిద్య్రమొందిరి
పరమ లోభులు ధన ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడితురైరి
దుష్టమానవులు వర్దిష్ణులైరి
తే. పక్షివాహన మావంటి భిక్షకులకు
శక్తిలేదాయె నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓస్వామీ! విద్యావంతులు ప్రయోజనం లేనివాళ్లు , మూర్ఖులు గౌరవార్హులవుతున్నారు. నిజం మాట్లాడితే లోకంలో గిట్టనివారు అవుతున్నారు. అధిక ప్రసంగులు రాణిస్తున్నారు. ధర్మపరాయణులు దరిద్రులవుతున్నారు. రోగ పీడితులవుతున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. నా వంటి వారికి శక్తి లేదు. మాకు నీవే దిక్కు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము