నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అవనిలో ఁగల యాత్రలన్ని చేయఁగ వచ్చు
ముఖ్యవౌ నదులందు మునుఁగవచ్చు
ముక్కు పట్టుక సంధ్యమొనసి వార్చఁగ వచ్చుఁ
దిన్నఁ గా జపమాలఁ ద్రిప్ప వచ్చు
వేదాల కర్థంబు విఱిచి జెప్పఁగ వచ్చు
ధనములక్షలు కోట్లు దానమీయఁగ వచ్చు
నైష్ఠికాచారముల్ నడుప వచ్చుఁ
తే. జిత్తమన్యస్థలంబులఁ జేరకుండ
నీ పదాంభోజముల యందు నిలుప ఁ గలమె
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం : ఓ స్వామీ ప్రపంచ యాత్ర లెన్నైనా చేయవచ్చు. ప్రసిద్ధ నదుల్లో స్నానమాడవచ్చు. ముక్కు పట్టుకొని రోజూ సంధ్యవార్చవచ్చు. తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్థం విడదీసి చెప్పవచ్చు. మంచి యాగాలు చేయవచ్చు. నిష్ఠగా ఆచారాలు నిర్వహించవచ్చు. కాని మనస్సుని ఇతర చింతల నుండి మరల్చి ఉంచటం సాధ్యమవుతుందా? అంటే అదే వీటికన్నింటికన్నా ఇదే కష్టం.

శ్రీ నరసింహ శతకములోని పద్యము