నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*
సీ. భుజ బలంబునఁ బెద్దపులులఁ జంపఁగ వచ్చు
పాము కంఠముఁజేతఁబట్టవచ్చు
బ్రహ్మ రాక్షస కోట్లఁ బాఱ ఁద్రోల వచ్చు
మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు
పదును ఖడ్గము చేత నదుమ వచ్చు
గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొర వచ్చుఁ
దిట్టు భోతుల నోళ్లు కట్టవచ్చు
తే. బుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలిసి
సజ్జనులఁ జేయలేఁదెంత చతురుఁడైన
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!

భావం: ఓ ప్రభూ! బాహుబలంతో పులుల్ని మట్టుపెట్టవచ్చు. పాము మెడని చేత పట్టుకోవచ్చు. కోటానుకోట్ల బ్రహ్మ రాక్షసుల్ని తరిమి కొట్టవచ్చు. మానవుల రోగాలు మాన్పవచ్చు.నాలుకకు ఇంపు గొల్పని చేదు మ్రింగవచ్చు. వాడియైన కత్తిని చేతితో నదిమి పట్టుకోవచ్చు. కష్టపడి ముండ్ల కంచెలో దూరవచ్చు. పడతిట్టేవారి నోర్లు మూయించవచ్చు. కాని ఈ ప్రపంచంలో దుర్జనులకు జ్ఞాన బోధ చేసిన సజ్జనుల్ని చేయడం చాలా కష్టం.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003