నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. కర్ణయుగ్మమున నీ కథలు సోకినఁ జాలు
పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు
చేతులెత్తుచు ఁ బూజఁ జేయగల్గినఁ జాలు
దొరయఁగా కడియాలు దొడిగినట్లు
మొనసి మస్తకముతో మ్రొక్కఁ గల్గిన ఁ జాలుఁ
జెలువమైన తురాయి చెక్కినట్లు
స్వరము నొవ్వంగ నీ స్మరణ గల్గిన ఁ జాలు
వింతగాఁ గంఠీలు వేసినట్లు

తే. పూని నినుఁ గొల్చుటే సర్వభూషణంబు
లితర భూషణముల నిచ్చగింప నేల?
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహారై నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహా ప్రభూ! నీ కథల్ని వినటమే చెవులకు పెద్ద దుద్దుల జత తాల్చినట్లు చేతులెత్తి పూజిస్తే అవే చేతి కడియాలు. నీకు తలవంచి నమస్కరించటమే నెత్తి మీతి కలికితురాయి. గొంతు నొప్పి పుట్టేట్టు నిన్ను చింతిస్తే ఆ చింతనమే కంఠాభరణం. ప్రయత్నించి నిన్ను సేవించుటమే అన్ని అలంకారాలు దాల్చినట్లు అవుతుంది. ఇక ఇతర ఆభరణాలతో పనిలేదు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము