నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*

సీ. భువన రక్షక! నిన్ను ఁ బొగడనేరని నోరు
ప్రజ క గోచరమైన పాడుబొంద
సురవరార్చిత ! నిన్నుఁ జూడ ఁగోరని కనుల్
జలములోపల నెల్లి సరపు గుండ్లు
శ్రీరమాధిప! నీకు సేవఁ జేయని మేను
కూలి కమ్ముడు వోని కొలిమి తిత్తి
వేడ్కతో నీ కథల్ వినని కర్ణంబులు
కఠిన శిలాదులఁ గలుగు దొఱలు

తే. పద్మలోచన! నీమీద భక్తి లేని
మానవుఁడు రెండు పాదాల మహిషమయ్య!
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహా ప్రభూ! నీ స్తుతి చేయని నోరు పాడుగొయ్యి. నిన్ను చూడని కండ్లు నీటిలోని మొగ్గలు, నీ సేవ చేయని శరీరం పనికిరాని కొలిమితిత్తి. నీ కథలు వినని చెవులు రాతితొఱ్ఱలు. నీ పై భక్తిలేని మానవుడు రెండు గాళ్ల దునే్న. అందుకే నరసింహా అన్ననామాన్ని పలుకుతూ జన్మను సార్థకం చేసుకోవాలి.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003