నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అతివిద్య నేర్చుట యన్న వస్తమ్రులకే
వశుల నార్జించుట పాలకొఱకే
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే
సుతులఁబోషించుట గతుల కొఱకె
సైన్యముల్ గూర్చుట శత్రుభయంబుకే
సాము నేర్చుట లెల్ల చావు కొరకే
దానమిచ్చుటల ముందటి సంచితమునకె
ఘనముగా ఁ జదువుటల్ కడుడు కొఱకె

తే. ఇతర కామంబుఁ గోరక సతతముగను
భక్తి నీయందు నిల్పుట ముక్తి కొఱకె
భూషణ వికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: నరసింహ ప్రభూ తిండి గుడ్డల కోసమే ఎక్కువ చదువులు. పాల కోసమే పశువుల్ని మేపడం అంటే వాటికోసం యత్నించడం, సంసార సుఖం కోసమే పెళ్లాడటం, పుణ్యలోక ప్రాప్తి కోసమే బిడ్డ ల్ని కనటం. శత్రు భయంతోనే సైన్య సమీకరణం చావుకోసమే సాముగరిడీలు నేర్వడం జన్మాంతర సుఖం కోసమే దానం చేయడం. కోటి విద్యలు కూటికొరకే అన్ని కోర్కెలు మానుకొని నీయందే భక్తిని నిల్పటమంటే మోక్షం కోసమే కదా.

శ్రీ నరసింహ శతకములోని పద్యము