నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వఁగఁబోదు
ధనమెన్నటికి శాశ్వతంబుగాదు
దారసుతాదులా తన వెంటరాలేరు
భృత్యులు మృతిని తప్పింప లేరు
బంధుజాలము తన్నుఁ బ్రతికించుకోలేరు
బల పరాక్రమమమేమి పనికిరాదు
ఘనమైన సకల భాగ్యములెంతఁ గల్గియు
గోచి మాత్రంబైన ఁ గొనుచుఁబోఁడు
తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన చేసెడి వారికి ఁబరమసఖము
భూషణ వికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!

భావం: ఓ స్వామీ ఈ మేను ప్రపంచంలో వేయేండ్లు మనదు. గడించిన డబ్బు శాశ్వతం కాదు. పెళ్లాంపిల్లలెవ్వరు చనిపోయేనాడు వెంటరారు. సేవకులు, చుట్టాలు ఎవరూ కాపాడలేరు బతికించలేరు. బలపరాక్రమాలేవీ పనిచేయవు. ఎంత సిరిసంపదలార్జించినా గోచిపాతంత కూడా వెంట రాదు. వెఱ్ఱికుక్కల్లాగా భ్రాంతికి లోబడకుండా నిన్ను సేవించేవారికే ఎంతో సుఖం కల్గుతుంది.

శ్రీ నరసింహ శతకములోని పద్యము