నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. దేవగురు నందనుండను
రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదేశించి సు
ధీవినుతుఁ డొనర్చుచుండె దేవహితంబుల్

భావం: పండితుల చేత స్తుతింపబడు వాడున్నూ, బృహస్పతి కుమారుడున్నూ అయినటువంటి కచుడు దేవతల నివాసమైన స్వర్గానికి వెళ్లి దేవతలకు సంజీవని విద్య ఉపదేశించి దేవతలకు మేలు చేస్తున్నాడు. అట్లా కచుడు సంజీవని విద్యను గ్రహించి కూడా తిరిగి దేవయాని చేత శాపం పొంది తాను సైతం దేవయానికి శాపం ఇచ్చి తన దేవలోకానికి వెళ్లాడు. కచుడు తాను నేర్చుకున్న విద్యనంతా ఇతర దేవతలకు అందరికీ బోధించి ఆ విద్యకు పరమార్థాన్ని కలిగిస్తున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము