నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ. ధీరత ఁబరుల నిందింప నేర్చితిఁగాని
తిన్నగా నిను ఁ బ్రహ్తుతింపనైతి
పొరుగు కామినులందు బుద్ధినిల్పితిఁగాని
నిన్నునే సతము ధ్యానింప నైతి
పొరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని
యెంచి నీకథలాల కించనైతి
కౌతుకంబునఁబాతకము గడించితిఁగాని
హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి
తే. అవనిలో నేను జన్మించి నందుకేమి
సార్థకము గానరదాయె స్వల్పమైన
భూషణవికాస!శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహప్రభూ! ధైర్యంగా ఇతరుల్ని తిట్టటం నేర్చానే గాని నిన్ను పొగడుతూ ధ్యానించలేకపోయాను. అన్యకాంతలపై ఆసక్తి పెంచుకున్నానే గాని, ఎల్లపుడు నిన్ను స్మరించలేకపోయాను. కల్లిబొల్లి కబుర్ల పై మక్కువ పెంచుకున్నానేగాని, నీకథల్ని చెవులార వినకపోయాను. ఎంతో ఉత్సాహంతో పాపాలు చేశానే గాని పుణ్యమార్జించలేకపోయాను. అందుకే ఈ లోకంలో పుట్టినందుకు నా జీవితానికి ఎలాంటి సార్థకత లేకుండాపోయింది.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003