నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*

సీ. జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి
బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణగురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాఁడు శైవ జనుఁడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి
యాస పోవక కాఁడు యతివరుండు
తే. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గరునిఁ జెందక సన్ముక్తి, దొరకఁబోదు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ముచ్చటైన జందెం ధరించినా, బ్రహ్మతత్త్వం తెలీకపోతే బ్రాహ్మణుడు కాలేదు. నొసటి పైన తిరుమణి శ్రీచూర్ణాలతో ఎగువరేఖలు దిద్దుకున్నా విష్ణుతత్వం తెలియకపోతే విష్ణ్భుక్తుడు కాలేడు. విబూది పట్టెలు నొసటిపై తీర్చుకొన్నా, పరమ శివతత్త్వం తెలియకపోతే శైవుడనిపించుకోడు. ఒంటిపై కాషాయ వస్త్రాలు కట్టుకోగానే సన్న్యాసి కాదు ఆశల్ని జయించినవాడే యతి.