నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ నీ భక్తులను కండ్లనిండఁ జూచిన రెండు
చేతుల జోహారు సేయువాఁడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ
వినయమందుచుఁ జాల వినెడువాఁడు
తన గృహంబునకు నీ దాసులు రాఁజూచి
పీటపైఁ గూర్చుండఁ బెట్టువాఁడు
నీ సేవకుల జాతి నీతులెన్నక చాల
దాసోహమని చేరఁదలఁచువాఁడు
తే॥ పరమభక్తుండు ధన్యుండు భానుతేజ
వానిఁగనుగొన్న పుణ్యంబు వసుధలోన
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ నరసింహస్వామీ! కళ్ళారా నీ భక్తుల్ని చూచి రెండు చేతులెత్తి నమస్కరించేవాడూ, ఎవరైనా నీ కథల్ని నైపుణ్యంగా చెపితే వినయంగా వినేవాడూ, తన యింటికి నీ దాసులువస్తే, పీట మీద కూర్చోబెట్టేవాడూ, నీ యాచకుల కుల వర్గ భేదాలు పాటించకుండ ‘దాసోహమ్మ’ని నీకు ఊడిగం చేసేవాడూ పరమభక్తుడు. అతడు గొప్ప ధన్యుడు. అలాంటివాణిణ చూస్తే గొప్ప పుణ్యం సుమా!