నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఉరగకళేబర మంసాం
తరమునఁ బడి వ్రేలు చునికిఁ దలపక యచల
స్థిరుఁడై పరమధ్యానా
వరతేంద్రియ వృత్తి నున్నవాని శమీకున్
భావం: తన ఇహస్పృహలేక వౌనంగా తపస్సు చేస్తూ కేవలం ఆవుల చన్నులు దూడలు కుడిచేటప్పుడు బయటికి వచ్చే పాలనురుగే తనకు భోజనమయ్యేట్లుగా వౌనవ్రతం పూని తపస్సుచేస్తున్న తన తండ్రి, ముసిలి వాడు , ఇంద్రియ నిగ్రహుడు అయిన వౌనిపై ఇలా చచ్చిన పాము కళేబరాన్ని వేసిన పరీక్షిత్తు పై కోపంతో రగిలి నేటినుంచి ఏడురోజులలో తక్షకుని వలన మరణం సంభవించుగాక అని శాపం ఇచ్చిన శమీకుని కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. పాము శవం మూపుల నడుమ నుండి వ్రేలాడుతుండటం తలపోయక పర్వతం వలె కదకున్నవాడై గొప్పదైన పరమాత్మ ధ్యానంచేత ఉడిగిన ఇంద్రియాల యొక్క వ్యాపారాలతో ఉన్న శమీకుని చూచి కన్నీరు చిందించాడు అతని పుత్రుడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము