నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ పక్షి వాహన! నేను బ్రతికినన్ని దినాలు
కొండెగాండ్రను గూడి కుమతినైతి
అన్నవస్తమ్రులిచ్చి ఆదరింపుము నన్ను
కన్నతండ్రివి నీవె కమలనాభ!
మరణమయ్యెడినాడు మమతతో నీయొద్ద
బంట్లఁదోలుము ముందు బ్రహ్మజనక!
ఇనజభటావళి ఈడిచికొనిపోక
కరుణతో నా యొద్దఁ గావలుంచు
తే॥ కొసకు నీ సన్నిధికిఁ బిల్చుకొనియు, నీకు
సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: స్వామీ! కొంటెగాండ్రతో చేరి చెడ్డవాణ్ణయ్యాను. అయినా నీవు కన్నతండ్రివి - దయతో నాకు తిండి, గుడ్డ ఇచ్చి కాపాడు. చావు దగ్గర పడేనాటికి విష్ణ్భుక్తుల్ని నా చెంతకు పంపించు. యమభటులు నన్ను ఈడ్చుకొని పోకుండ రక్షించు. నీ వారిని నా చెంత కాపలా ఉంచు. అవసాన దశలో నీ సన్నిధికి పిల్చుకొని నన్ను నీ సేవకుణ్ణి చేయి స్వామీ!