నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ నీకు దాసుఁడనంటి నిన్ను నమ్మితినంటిఁ
గాన నాపై నేడు కరుణఁజూడు
దోసిలొగ్గితినీకు ద్రోహమెన్నఁగఁబోకు
పద్మలోచన! నేను పరుఁడఁగాను
భక్తి నీపై నుంచి భజనఁ జేసెదఁగాని
పరులవేడను సుమ్మి వరములిమ్ము
దండి దాతవు నీవు తడవుచేయక కావు
ఘోరపాతక రాశిఁ గొట్టివైచి
తే॥ శీఘ్రముగఁ గోర్కెలీడేర్చి చింతఁదీర్చు
నిరతముగ నన్నుఁ బోషించు నెనరునుంచు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! నేను నీ భక్తుణ్ణి. నినే్న నమ్ముకున్నాను. నన్ను దయతో కాపాడు. ఇదో అంజలి ఘటించాను. నా తప్పులెన్నవద్దు. నేను ఇతరుణ్ణిగాను. నీ వాణ్ణి, భక్తితో నీ భజన చేస్తాను. అన్య దేవతల్ని అర్థించను. నా వరాలు తీర్చు. నీవు గొప్పదాతవు. ఆలసించక నన్ను రక్షించు. నా పాపాలన్నింటిని పటాపంచలు చేయి. కోర్కెల్ని నెరవేర్చి, నా చింతల్ని పారద్రోలి, నిత్యం నన్ను పోషించు, దయజూడు.