నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ నా తండ్రి! నాదాత! నా యిష్టదైవమా!
నన్ను మన్ననసేయు నారసింహ!
దయయుంచు నామీఁద తప్పులన్ని క్షమించు
నిగమగోచర! నాకు నీవె దిక్కు
నే దురాత్ముడనంచు నీ మనంబునఁ గోప
గింపఁబోకుము స్వామి! ఇంచుకైన
ముక్తిదాయక! నీకు మ్రొక్కినందుకు చాలఁ
గరుణించి రక్షించు కమలనాభ!
తే॥ దండి దొరవంచు నీవెంటఁ దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామి! నన్ను పోషించువాడివి. నా కోర్కెలు తీర్చేవాడివి. నా ఇష్టదేవతవి. నన్ననుగ్రహించు. నీవు వేదపురుషుడవు. నా తప్పులు సైచు. దుష్టుడనని నన్ను కోపగించకు. నీకు మ్రొక్కుతాను. నన్ను రక్షించు. గొప్ప ప్రభువు అని నిన్నాశ్రయించాను. నాకు ప్రత్యక్షమై నన్ను కాపాడు.