నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ నేమారు నీకథల్ వినుచు నుండెడి వాఁడు
పరుల ముచ్చట మీఁద భ్రాంతిపడఁడు
అగణితంబుగ నిన్నుఁ బొగడనేర్చినవాఁడు
చెడ్డమాటను నోటఁ జెప్పబోఁడు
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాఁడు
ధనమదాందుల వెంటఁ దగులఁబోఁడు
సంతసంమున నిన్ను స్మరణఁజేసెడివాఁడు
చెలఁగి నీచుల పేరు దలఁచఁబోఁడు
తే॥ నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగఁ
గోరి చిల్లర దైవముల్ గొల్వఁబోఁడు
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! పలుమార్లు నీ కథలు వినేవాడు ఇతరుల మాటలకి మోజుపడడు. ఎప్పుడూ నినే్న పొగడేవాడు చెడ్డమాటలాడడు. భక్తితో నిన్నర్చించేవాడు ధనగర్విగా నడువడు. నిన్ను ధ్యానించేవాడు దుర్మార్గుల పేరైనా ఎత్తడు. నిన్ననుసరించేవాడు కచ్చితంగా చిల్లర దేవతల్ని పూజించడు.