నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ నేనెంత వేడిన నీకేల దయరాదు?
పలుమారు పిలిచినఁ బలుకవేమి?
పలికిన నీకున్న పదవేమి పోవును?
మోమైనఁ బొడఁజూపవేమి నాకు?
శరణుఁజొచ్చిన వాని సవరింప వలెఁగాక
పరిహరించుట నీకు బిరుదుగాదు
నీ దాసులను నీవు నిర్వహింపకయున్నఁ
బరులెవ్వరగుదురు పంకజాక్ష?
తే॥ దాత, దైవంబు, తల్లియుఁ దండ్రి నీవె
నమ్మియున్నాను నీ పాద నళినములను
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ స్వామీ! ఎంత ప్రార్థించినా నీకేల దయరాదు? పలు పర్యాయాలు పిలిచినా పలుకవేల? పలికితే నీ పదవి ఊడుతుందా? నీ ముఖమెందుకు చూపవు? శరణన్న వారిని కాపాడాలి గాని తిరస్కరించుట పాడిగాదు. నీ భృత్యుల్ని నీవే రక్షించకపోతే ఇతరులెవ్వరు రక్షిస్తారు? నీవే దాతవు - దేవుడవు - తల్లివి తండ్రివి. నీ పాదపద్మాల్ని నమ్ముకున్నాను.