నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ వనజాతనాభ! నీ వంకఁజేరితి నేను
గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగ వరములియ్యక కాని
లేవఁబోయిన నిన్ను లేవనియ్య
కూర్చుండఁబెట్టి నీ కొంగు గట్టిగఁ బట్టి
పుచ్చుకొందును జూడు భోగశయన!
ఈవేళ నీకడ్డ మెవరు వచ్చినఁగాని
వారికైనను లొంగి వణఁకఁబోను
తే॥ గోపగాఁడను నీవు నా గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ నరసింహస్వామీ! నన్ను కాపాడుమని నీ పజ్జ చేరాను. నాకు వరాలియ్యకపోతే, నిన్ను కదలనివ్వను. నీ కొంగుబట్టి కూర్చోబెడతాను. నిన్ను కాపాడటానికి నాకెదురు ఎవరు వచ్చినా వారికి నేను జంకను. ఓ ప్రభూ! నేనసలే కోపిష్ఠిని. నా సంగతి తెలిసి నన్నిపుడే కాపాడి ఏలుకో.