నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ సర్వేశ! నీపాదసరసిజ ద్వయమందుఁ
జిత్తముంపఁగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచియుండెడియట్లు
చేసినన్నిపుడేలు సేవకుఁడను
వనజలోచన! నేను వట్టిమూర్ఖుఁడఁజుమ్మి
నీ స్వరూపముఁజూడ నేర్పు వేగ
తనకుమారులకుగ్గు తల్లిపోసినయట్లు
భక్తిమార్గంబను పాలుపోసి
తే॥ ప్రేమతో నన్ను ఁబోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీ దాసగణములోన
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహ ప్రభూ! అంతటికి నీవె అధికారివి. నీ పాదపద్మాలపై నా మనస్సుని కదలకుండ ఉంచలేకున్నాను. మనసుని కుదురుగా నిలిచేటట్లు నీ దాసుడవైన నన్ను కాపాడు. కమలనయనా! నీ ఆకృతి చూడని మూర్ఖుణ్ణి. తల్లి పాలిచ్చి బిడ్డని పోషించే విధంగా భక్తిమార్గమనే పాలుపోసి నీవు ప్రేమతో పోషించు. నీ భృత్యగణంలో నా పేరు నిల్పు.