నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక
కమలారి యతి కళంకమునఁ బడియె
సొగసైన నీ నేత్ర యుగముతో సరిరాక
నళిన బృందము నీళ్ల నడుమఁజేరె
కవిరాజ వరద! నీ గళముతో సరిరాక
పెద్ద శంఖము బొబ్బపెట్టఁదొడఁగె
శ్రీపతీ! నీ దివ్యరూపుతో సరిరాక
పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁడయ్యె
తే॥ ఇందిరాదేవి! నిన్ను మోహించి విడక
నీకుఁ బట్టమహిషి యయ్యె నిశ్చయముగ
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ స్వామీ! నీది మబ్బురంగు. నీ ముఖ సౌందర్యంతో చంద్రుడు మచ్చగల వాడైనాడు. అందమైన నీ కళ్లతో సరితూగజాలక తామరలు నీటి మధ్య దాగాయి. గజేంద్రుని కాపాడిన నీ గొంతుకతో సరిరాక శంఖము పెడబొబ్బ పెడుతోంది. లక్ష్మీనాథుడవైన నీతో పోలజాలక మన్మథుడు నీ కొడుకయ్యాడు. లక్ష్మీదేవి నిన్ను ప్రేమించి నీ పట్టపురాణి అయింది. ఇది నిజం.