నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ హరిదాసులను వాదులాడకుండినఁ జాలు
సకల గ్రంథంబులు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలు
చేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండినఁ జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు
గనకకంబపుగుళ్లు గట్టినట్లు
తే॥ ఒకని వర్షాశనము దీయకున్నఁ జాలుఁ
బేరుకీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! విష్ణ్భుక్తుల్ని నిందించకుండా వుంటే అది సకల శాస్త్రాలు చదివినంత గొప్ప. దానధర్మాలు మాన్పించకపోతే, తాను చేఁజేతులా దానం చేసినట్లే. మంచి వారిని మోసగించకుంటే చాలు మంచి బహుమానాలిచ్చినంత. దేవాలయ మాన్యాల్ని తీసివేయకుంటే చాలు బంగారు దేవళాలు నిర్మించినంత పుణ్యం. ఒకరి వార్షికాన్ని పాడుచేయకపోతే చాలు గొప్పగా సత్రాల్ని నిర్మించినంత మంచిది.