నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ వదనంబు నీ నామ భజన గోరుచునుండు
జిహ్వ నీ కీర్తనల్ సేయఁగోరు
హస్తయుగ్మము నిన్ను నర్చింపఁగోరును
కర్ణముల్ నీ మీద కథలుగోరు
తనువు నీసేవయే ఘనముగాఁ గోరును
నయనముల్ నీ దర్శనంబుఁగోరు
మూర్దమ్ము నీపాదముల మ్రొక్కఁగాఁగోరు
ఆత్మ నీదైయుండు నరసి చూడ

తే॥ స్వప్నములనైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందుఁ బూని యుండు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! నా మోము నీ భజనని, నాల్కనీ కీర్తనని, చేతులు నీ పూజని, చెవులు నీ కథల్ని, దేహం నీ సేవల్ని, కళ్లు నీ దర్శనాన్ని, శిరస్సు నీ పాదాభివందనాన్ని, ఆత్మ నీ ఆధీనాన్ని ఆశిస్తుంటాయి. కలలోనైనా, మెలకువనైనా అన్ని వేళల్లో నా మనస్సు నీ పాదధ్యానంలోనే లగ్నమై ఉంటుంది.